Palla srinivas: టీడీపీ నేత ప‌ల్లా కుటుంబానికి చెందిన ఆస్తుల కూల్చివేత‌

palla assets demolition
  • పల్లా శ్రీనివాస్ పై అవినీతి ఆరోప‌ణ‌లు
  • తెల్ల‌వారుజాము నుంచి విశాఖ‌లో కూల్చివేత‌లు
  • రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యేనంటోన్న బాధితులు
టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పై వైసీపీ నేత‌లు కొన్ని రోజులుగా అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. పల్లా శ్రీనివాస్ ఒకేచోట 56 ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశాడని తేలిందంటూ నిన్న వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు తెల్ల‌వారుజాము నుంచి విశాఖ‌లో ప‌ల్లా కుటుంబానికి చెందిన ఆస్తుల‌ను అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసు బ‌ల‌గాల మ‌ధ్య కూల్చివేత ప‌నులు జ‌రుగుతున్నాయి. రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే త‌మ ఆస్తుల‌ను కూల్చి వేస్తున్నార‌ని గాజువాక‌లోని ప‌ల్లా కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.


Palla srinivas
Telugudesam
Vizag

More Telugu News