వైసీపీ ఎంపీల జాబితా నుంచి నా పేరు తొలగించారు: రఘురామకృష్ణరాజు

12-06-2021 Sat 20:18
  • లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన మార్గాని భరత్
  • తనపై అనర్హత వేటు వేయలేరన్న రఘురామ
  • పార్టీ నుంచి తొలగించడంపై సమాచారం లేదని వెల్లడి
Raghurama Krishna Raju latest comments on YCP

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తన ఆక్రోశం వెలిబుచ్చారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆరోపించారు. పార్టీ నుంచి వైసీపీ అధినేత నన్ను బహిష్కరించారా...? దీనిపై నాకు ఎటువంటి స్పష్టత లేదు, ఎవరైనా చెప్పగలరా? అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన తనపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంపై స్పందించారు. తనపై అనర్హత వేటు వేయడం కుదరదని, తాను ఏ పార్టీతో కలవలేదని స్పష్టం చేశారు. అధికార వైసీపీ కార్యకలాపాలకు ఎక్కడా వ్యతిరేకంగా వ్యవహరించలేదని రఘురామ వివరించారు.