ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం!
- బట్టల షోరూంలో చెలరేగిన మంటలు
- 30 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
- వీడియోను పోస్ట్ చేసిన అగ్నిమాపక అధికారి
70 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధిపతి అతుల్ గార్గ్ చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సిబ్బంది వెతుకుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగినట్టు ఉదయం 10.20 గంటలకు ఫోన్ వచ్చిందని అధికారులు తెలిపారు.