NASA: టీఓఐ-1231బి... ఇది భూమిని పోలిన గ్రహం!

  • నాసా సరికొత్త ఆవిష్కరణ
  • 90 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహం
  • గ్రహంపై మేఘాలతో కూడిన వాతావరణం
  • 57 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు
NASA finds new planet like earth

అనంత విశ్వంలో భూమిని పోలి, జీవం కలిగిన గ్రహాల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అగ్రగామిగా ఉంది. తాజాగా నాసా వ్యవస్థలు ఓ భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించాయి. దీనికి టీఓఐ-1231బి అని నాసా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహంపై మేఘాలతో కూడిన వాతావరణం కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 57 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నట్టు తెలుసుకున్నారు. దీని పరిమాణం భూమి కంటే చాలా ఎక్కువని తెలిపారు.

అయితే నాసా ఇప్పటివరకు గుర్తించిన కొత్త గ్రహాల్లో ఇదే చిన్నది. ఇది భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పేర్కొన్నారు. అయితే ఇది నివాసయోగ్యమా? కాదా? అని తెలుసుకునేందుకు మరికొన్ని పరిశోధనలు అవసరమని నాసా పేర్కొంది. ఈ కొత్త గ్రహాన్ని కనుగొనడంలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూమెక్సికో పరిశోధకులు పాలుపంచుకున్నారు.

More Telugu News