Rajasthan: ఢిల్లీ పర్యటనలో సచిన్‌ పైలట్‌.. రాహుల్‌, ప్రియాంకను కలవడం లేదన్న యువనేత!

  • గతంలో పార్టీలో తిరుగుబాటు చేసిన పైలట్‌
  • సచిన్ తో మాట్లాడానన్న రీటా బహుగుణ 
  • ఆ వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన సచిన్‌ పైలట్‌
  • ప్రాధాన్యత సంతరించుకున్న సచిన్ ఢిల్లీ పర్యటన  
Sachin Pilot On delhi tour

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ కీలక నేత సచిన్‌ పైలట్‌ ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. అయితే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని కానీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకను కానీ కలిసే యోచన లేదని సచిన్‌ తెలిపారు.

గత ఏడాది పార్టీ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ పై సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్‌కు చెందిన జితిన్‌ ప్రసాద ఇటీవలే బీజేపీలో చేరారు. సచిన్‌, జితిన్‌ ఇరువురు రాహుల్‌ సన్నిహిత వర్గంలో కీలక సభ్యులు. మరోవైపు సచిన్‌ బీజేపీలో చేరడంపై ఆయనతో చర్చించానని కమలం పార్టీ నేత రీటా బహుగుణ తెలిపారు. దీన్ని సచిన్‌ కొట్టిపారేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సచిన్‌ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సతరించుకుంది. మరోవైపు గత ఏడాది తిరుగుబాటు చేసిన వర్గంలో ఒకరైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హేమారామ్‌ చౌదరి ఇప్పటికే స్పీకర్‌కు రాజీనామా లేఖ రాశారు. ఆయన ఈరోజే సచిన్‌ పైలట్‌తో భేటీ కావడం గమనార్హం. మరోవైపు ఢిల్లీకి బయలుదేరే ముందు ఇంధన ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో సచిన్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

More Telugu News