'ఐకాన్' ఉందని తేల్చిచెప్పిన బన్నీ వాసు!

11-06-2021 Fri 18:57
  • ఈ రోజున బన్నీవాసు పుట్టిన రోజు
  • 'ఐకాన్' విషయంలో వచ్చిన క్లారిటీ
  • 'పుష్ప' ఫస్టు పార్టు తరువాత సెట్స్ పైకి
Bunny Vasu gave a clarity on Icon movie

అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఆ మధ్య నిర్మాత దిల్ రాజు - దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 'వకీల్ సాబ్' తరువాత దిల్ రాజు - వేణు శ్రీరామ్ మళ్లీ ప్రయత్నించినా బన్నీ పెద్దగా స్పందించలేదనే టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా ఉందని తాజాగా బన్నీవాసు స్పష్టం చేశాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. బన్నీ 'పుష్ప 1' చేసిన తరువాత 'ఐకాన్' సెట్స్ పైకి వెళుతుందని ఆయన అన్నాడు. ఆ తరువాతనే 'పుష్ప 2' షూటింగు మొదలదలవుతుందని చెప్పాడు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదనే విషయాన్ని స్పష్టం చేశాడు.

అంటే 'పుష్ప' ఫస్టు పార్టుకు .. సెకండ్ పార్టుకు మధ్య 'ఐకాన్' ఉంటుందన్న మాట. ఇక మురుగదాస్ ... బోయపాటితో కూడా బన్నీ చేయనున్నాడనీ .. అయితే ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది అప్పుడే చెప్పలేమని అన్నాడు. ఎలాగైతేనేం మొత్తానికి 'ఐకాన్' విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.