షర్మిలను భయపెట్టిన బల్లి.. వీడియో చూడండి!

11-06-2021 Fri 18:38
  • వికారాబాద్ జిల్లాలో పర్యటించిన షర్మిల
  • ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ పై విమర్శలు
  • ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్లగా ఆసక్తికర ఘటన
YS Sharmila afraid of lizard

ఎంత ధైర్యం ఉన్నా కొన్నిసార్లు చిన్ని విషయాలకే ఉలిక్కిపడుతుంటారు. తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న వైయస్ షర్మిలకు ఈరోజు ఇలాంటి సరదా అనుభవమే ఎదురైంది. వికారాబాద్ జిల్లాలో ఈరోజు ఆమె పర్యటించారు. రైతులతో ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.

పర్యటనలో భాగంగా సంచుల్లో పోసి, కప్పి ఉంచిన ధాన్యాన్ని ఆమె పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ధాన్యంపై కప్పి ఉంచిన పట్టాను తొలగించేందుకు ఆమె ప్రయత్నించగా... అక్కడ బల్లి ఉండటంతో ఆమె కేకలు వేశారు. వెంటనే ఆమె అక్కడి నుంచి వెనక్కి కదిలారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.