గోపీచంద్ బర్త్ డే సందర్భంగా 'పక్కా కమర్షియల్' పోస్టర్ రిలీజ్!

11-06-2021 Fri 18:32
  • రిలీజ్ కి సిద్ధంగా 'సీటీమార్'
  • కొత్త ప్రాజెక్టుగా 'పక్కా కమర్షియల్'
  • దర్శకుడిగా మారుతి
  • గోపీచంద్ జోడీగా రెండోసారి రాశి ఖన్నా
Pakka Commercial special poster release

మారుతి - గోపీచంద్ కాంబినేషన్లో 'పక్కా కమర్షియల్' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు పరుగులు పెట్టడం లేదు. త్వరలోనే చిత్రీకరణకి సంబంధించిన పనులు ఊపందుకోనున్నాయి. 'సీటీమార్' తరువాత గోపీచంద్ చేస్తున్న సినిమా ఇది. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మాంఛి జోష్ తో స్టెప్పులు వేస్తూ, మరింత హ్యాండ్సమ్ గా గోపీచంద్ కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జిల్' విజయాన్ని అందుకుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన ' ప్రతి రోజూ పండగే' సినిమా కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ లేకుండా ఉన్నాడు. ఈ సినిమాతో తన నిరీక్షణ ఫలిస్తుందని ఆయన భావిస్తున్నాడు.