ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్

11-06-2021 Fri 18:06
  • ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన దిలీప్ కుమార్
  • ముంబయి హిందూజా ఆసుపత్రిలో చికిత్స
  • క్రమంగా కోలుకున్న వైనం
  • ఓ దశలో ఆరోగ్యంపై పుకార్లు
  • స్పష్టత నిచ్చిన అర్ధాంగి
Bollywood actor Dilip Kumar discharged from hospital

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (98) ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఆయనను ముంబయిలోని హిందూజా ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి చేశారు. అయితే, ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ కొనసాగించాలని వైద్యులు నిర్ణయించారు. ఇటీవల దిలీప్ కుమార్ తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 6న జరిపిన వైద్య పరీక్షలో ఆయన బైలేటరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. ఓ దశలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమంగా మారిందని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన అర్ధాంగి సైరా బాను సోషల్ మీడియాలో స్పష్టతనివ్వడంతో పుకార్లుకు తెరపడింది.