Supreme Court CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్

KCR welcomes CJI NV Ramana
  • సీజేఐ అయిన తర్వాత తొలిసారి హైదరాబాదుకు విచ్చేసిన జస్టిస్ రమణ
  • ఎయిర్ పోర్ట్ వద్ద స్వాగతం పలికిన హైకోర్టు సీజే, మంత్రి కేటీఆర్
  • రాజ్ భవన్ లో మూడు రోజులు బస చేయనున్న సీజేఐ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాదుకు విచ్చేశారు. సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాదులో అడుగుపెట్టారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీఎస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ తో పాటు పలువును ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి సీజేఐ రాజ్ భవన్ లోని అతిథి గృహానికి చేరుకున్నారు. రాజ్ భవన్ వద్ద ఆయనకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సీజేఐ రాజ్ భవన్ లో బస చేయనున్నారు.

.
Supreme Court CJI
Justice Ramana
Hyderabad
KCR
TRS

More Telugu News