బాలయ్య మూవీలో 'క్రాక్' విలన్!

11-06-2021 Fri 17:56
  • తమిళంలో విలన్ రోల్స్ తో బిజీ
  • 'క్రాక్'తో తెలుగులోను క్రేజ్
  • మరోసారి ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని
Varalakshmi Sharath Kumar in Balakrishna and Gopichand Malineni combo

తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ గా తీసుకోవాలంటే చాలామంది కథానాయికల పేర్లు పరిశీలనలోకి వస్తాయి. కానీ ఈ రెండు భాషల్లో లేడీ విలన్ గా ఎవరిని తీసుకోవాలంటే మాత్రం .. ఒకే ఒక్క ఛాయిస్ ఉంది .. ఆ ఛాయిస్ పేరే వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ తరంలో లేడీ విలన్ అంటే ఆమెనే .. ప్రస్తుతానికి ఆమెకి ప్రత్యామ్నాయం లేదు. 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మీ శరత్ కుమార్, 'క్రాక్' సినిమాలో విలన్ గా శభాష్ అనిపించుకుంది.

అలాంటి వరలక్ష్మీ శరత్ కుమార్, తెలుగు తెరపై మరోసారి విలన్ గా విజృంభించనుంది .. అదీ బాలయ్య సినిమాలో కావడం విశేషం. 'క్రాక్'తో భారీ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని, బాలయ్యతో ఓ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. 'క్రాక్' సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు 'క్రాక్'లో హీరోయిన్ గా చేసిన శ్రుతిహాసన్ ను ఈ సినిమా కోసం ఒప్పించాడు. అదే విధంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా తీసుకున్నాడని అంటున్నారు. ఈ సెంటిమెంట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.