ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్

11-06-2021 Fri 15:24
  • ఢిల్లీలో రెండ్రోజులు పర్యటించిన సీఎం జగన్
  • వరుస భేటీలతో బిజీబిజీ
  • రాష్ట్ర అంశాలపై కేంద్ర ప్రముఖులతో సమావేశాలు
  • రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా చర్చలు
CM Jagan Delhi tour concludes

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.

సీఎం జగన్ చివరగా ఈ ఉదయం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ వివాదంపై చర్చించారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని పేర్కొంటూ, ఆ మేరకు కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా సూచించారు. కాకినాడ ఎస్ఈజెడ్ లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు అంశాన్ని కూడా కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించారు.

సీఎం జగన్ నిన్న కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్ షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లను కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.