అభిమానులకు 'సర్కారు వారి పాట' విజ్ఞప్తి

11-06-2021 Fri 15:11
  • కరోనా వ్యాప్తితో నిలిచిన షూటింగ్
  • అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
  • రకరకాల వార్తలు ప్రచారం
  • స్పందించిన చిత్ర యూనిట్
Sarkaru Vaari Paata unit announcement on on air news

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురాం కాంబినేషన్లో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయిక. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో షూటింగ్ నిలిచిపోయింది. అయితే, చాలారోజులుగా 'సర్కారు వారి పాట' నుంచి అప్ డేట్ రాకపోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది.

సర్కారు వారి పాట చిత్రంపై ఉత్సుకత, కోలాహలం తీవ్రస్థాయిలో ఉన్నాయని పేర్కొంది. అయితే ఈసారి తాము విడుదల చేసే అప్ డేట్స్ మామూలుగా ఉండవని అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. షూటింగ్ పునఃప్రారంభమైతే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పంచుకుంటామని చిత్రయూనిట్ వెల్లడించింది. అప్పటివరకు అభిమానులు అన్ని కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించింది.