మూడు వారాల నుంచి పెరుగుతున్న బ్లాక్​ ఫంగస్​ కేసులు

11-06-2021 Fri 15:08
  • ఇప్పటిదాకా దాని బారిన 31,216 మంది
  • మరణించిన వారు 2,109 మంది 
  • మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు, మరణాలు
Black Fungus Cases on rise since 3 weeks

కరోనా నుంచి కోలుకున్నారన్న ఆనందం పొందేలోపే బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఒకటి పోయిందనుకుంటే మరొకటి వచ్చి తగులుతోంది. మూడు వారాల నుంచి ఈ బాపతు కేసులు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడగా.. 2,109 మంది దాకా మరణించారు.

యాంఫో టెరిసిన్ బీ ఔషధం చాలా చోట్ల లభించట్లేదు. దీంతో ఆ మందు కొరత వల్లే చాలా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా, 7,057 బ్లాక్ ఫంగస్ కేసులతో మహారాష్ట్ర ముందుండగా.. 609 మంది మరణించారు. గుజరాత్ లో 5,418 మంది దాని బారిన పడ్డారు. అందులో 323 మంది చనిపోయారు. 2,976 కేసులు నమోదైన రాజస్థాన్ మూడో ప్లేస్ లో ఉంది. కర్ణాటకలో 1858 మంది చనిపోయారు.