Russia: సోషల్ మీడియా వేదికలపై కొరడా ఝళిపిస్తున్న రష్యా

  • నిషిద్ధ కంటెంట్ తొలగించాలని ఆదేశాలు
  • ఆజ్ఞలను పట్టించుకోని ఫేస్ బుక్, టెలిగ్రామ్
  • తీవ్రంగా పరిగణించిన మాస్కో కోర్టు
  • భారీ జరిమానా విధింపు
  • గతంలోనూ ఈ రెండు సైట్లపై జరిమానా
Russia fined social media sites Facebook and Telegram

సోషల్ మీడియా సైట్లకు రష్యాలో గడ్డుకాలం ఎదురవుతోంది. అభ్యంతరకర కంటెంట్ ను కలిగి ఉన్నాయంటూ ఫేస్ బుక్, టెలిగ్రామ్ యాప్ లపై రష్యా ప్రభుత్వం జరిమానా వడ్డించింది. అంతేకాదు, ట్విట్టర్ పైనా నిషేధం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది.

ఇటీవల విపక్ష నేత అలెక్సీ నావల్నీ అరెస్ట్ అనంతరం రష్యా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు పెల్లుబికాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడానికి సోషల్ మీడియా సైట్లే కారణమని అక్కడి అధికార యంత్రాంగం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో, పలు సోషల్ మీడియా వేదికలపై చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్ తొలగించాల్సిందేనని హుకుం జారీ చేసింది.

అయితే, ఫేస్  బుక్, టెలిగ్రామ్ యాప్ రష్యా ప్రభుత్వ ఆజ్ఞలను పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యాన్ని మాస్కో కోర్టు తీవ్రంగా పరిగణించి ఫేస్ బుక్ కు రూ.1.72 కోట్లు, టెలిగ్రామ్ యాప్ కు రూ.1.01 కోట్ల మేర జరిమానా విధించింది. గతంలోనూ ఈ రెండు సంస్థలపై పుతిన్ సర్కారు జరిమానా విధించింది.

More Telugu News