టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు

11-06-2021 Fri 12:50
  • మధుకాన్‌ గ్రూప్‌ సంస్థల్లో త‌నిఖీలు
  • మ‌రో ఐదు ప్రాంతాల్లో ఏక‌కాలంలో సోదాలు
  • రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోప‌ణ‌లు  
ed conduct searches at nama residents

టీఆర్ఎస్ ఎంపీ, ఖమ్మం కీల‌క నేత‌ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన కార్యాల‌యాలు, ఇళ్ల‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఈ రోజు దాడులు చేస్తున్నారు. మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలతో పాటు మ‌రో ఐదు ప్రాంతాల్లో ఈ  త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోప‌ణ‌లు వచ్చిన నేప‌థ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  

మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంచి  ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాల‌పై త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు అడుగుతున్నారు.