ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ మ‌రో లేఖ‌!

11-06-2021 Fri 11:41
  • ఇచ్చిన  హామీని నిల‌బెట్టుకోవాలి
  • సీపీఎస్‌ విధానం రద్దు చేయాలి
  • పాత విధానాన్ని కొనసాగిస్తామ‌ని చెప్పారు క‌దా?
 raghu rama writes letter to jagan

వృద్ధాప్య పింఛ‌న్ల విషయంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు నిన్న ఓ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలంటూ ఈ రోజు మ‌రో లేఖ రాశారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో సీపీఎస్‌ విధానం రద్దు చేయాల‌ని ఆయ‌న కోరారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ముఖ్య‌మంత్రి జగన్‌ పాదయాత్ర చేసిన స‌మ‌యంలో సీపీఎస్‌ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని ర‌ఘురామ‌ గుర్తుచేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తానన్నారని, అందుకే ఆ ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వస్తే ఏడు రోజుల్లోనే ఈ హామీ నెరవేరుస్తామ‌ని చెప్పార‌ని, ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని విమ‌ర్శించారు. ఇప్ప‌టిక‌యినా జగన్ హామీని నిల‌బెట్టుకోవాల‌ని, సీపీఎస్ విధానాన్ని వెంట‌నే రద్దు చేయాల‌ని ర‌ఘురామ‌ కోరారు.