హైద‌రాబాద్ నుంచి ప‌రిగి బ‌య‌లుదేరిన ష‌ర్మిల‌.. చింతపల్లి వ‌ద్ద‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న‌ పోలీసులు

11-06-2021 Fri 11:15
  • ఐకేపీ సెంటర్‌లో ధాన్యాన్ని ప‌రిశీలించ‌డానికి వెళ్తున్న షర్మిల 
  • కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి
  • ఐకేపీ సెంటర్ దగ్గర భారీ బందోబ‌స్తు
sharmila to reach parigi

రంగారెడ్డి జిల్లా పరిగి నియోజక వర్గం దోమ మండలంలోని పాలెపల్లి  ఐకేపీ సెంటర్‌లో ధాన్యాన్ని ప‌రిశీలించ‌డానికి వెళ్తున్న వైఎస్‌ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. హైద‌రాబాద్‌లోని  లోటస్‌పాండ్ నుంచి వికారాబాద్ జిల్లా చింతపల్లి దగ్గరకు రాగానే ఆమె  కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి ఉంది.

నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేయ‌డంతో ష‌ర్మిల మ‌ద్ద‌తుదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల‌ మరికాసేపట్లో దోమ మండలం పాలెపల్లికి చేరుకోనున్నారు. అయితే, ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు అసత్య ప్రచారం  చేస్తున్నార‌ని వారిని అడ్డుకుంటామ‌ని టీఆర్ఎస్ శ్రేణులు అంటుండ‌డంతో ఐకేపీ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.