కొత్త డైరెక్టర్ తో సెట్స్ పైకి రవితేజ!

11-06-2021 Fri 10:46
  • ముగింపు దశలో 'ఖిలాడి'
  • మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
  • కొత్త డైరెక్టర్ కి ఛాన్స్
  • వచ్చేనెలలోనే సెట్స్ పైకి
Raviteja next movie shooting starts from July

రవితేజ ప్రస్తుతం దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలను సెట్ చేసుకుని, చకచకా కానిచ్చేస్తున్నాడు. వచ్చేనెల నుంచి ఆయన నటించే మరో ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. పాయింట్ కొత్తదే అయినా రవితేజ మార్కులోనే ఉంటుందని అంటున్నారు.

షూటింగు మొదలుకాకముందే ఈ సినిమా ఫస్టులుక్ ఎలా ఉండాలనే విషయం దగ్గర నుంచి ప్రతీదీ దర్శకుడు డిజైన్ చేసుకున్నాడట. టైటిల్ సాంగ్ .. థీమ్ సాంగ్ ఎలా ఉండాలనే విషయంలోను పూర్తి క్లారిటీతో ఉన్నట్టుగా చెబుతున్నారు. రవితేజ అభిమానులు ఆశించే విధంగానే టైటిల్ వుంటుందట. కథ ప్రకారం ఇద్దరు కథానాయికలకు చోటు ఉంటుంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'ఖిలాడి' .. చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే విడుదల తేదీ చెప్పనున్నారట.