సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

11-06-2021 Fri 07:45
  • అజయ్ దేవగణ్ సరసన రాశిఖన్నా 
  • పవన్ సినిమాలో దర్శకుడు వినాయక్?
  • 'ఆహా'కు మారుతి సినిమా హక్కులు  
Rashi Khanna opposite Ajay Devagan

*  మిగతా హీరోయిన్లలానే రాశిఖన్నా కూడా ఇప్పుడు వెబ్ సీరీస్ మీద దృష్టిపెట్టింది. ఇప్పటికే రాజ్& డీకే దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్ కి సంతకం చేసిన ఈ చిన్నది.. తాజాగా అజయ్ దేవగణ్ నటించే వెబ్ సీరీస్ లో నాయికగా నటించడానికి ఓకే చెప్పింది. 'రుద్ర- ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' పేరిట ఈ వెబ్ సీరీస్ రూపొందుతోంది.
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ త్వరలో పవన్ కల్యాణ్ సినిమాలో కనిపించనున్నట్టు సమాచారం. పవన్, రానా హీరోలుగా రూపొందుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో ఓ గెస్ట్ పాత్రలో వినాయక్ నటించనున్నాడట.
*  సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగును కేవలం 30 రోజుల్లో పూర్తిచేయనున్నారు. ఇక ఈ చిత్రం డిజిటల్ హక్కులను 'ఆహా' ఓటీటీ ప్లేయర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనిని డైరెక్టుగా 'ఆహా'లో రిలీజ్ చేస్తారు.