Jagan: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

  • ఢిల్లీ పర్యటనలో జగన్ బిజీ
  • వరుసగా కేంద్ర ప్రముఖులతో సమావేశాలు
  • రాష్ట్రాభివృద్ధిపై చర్చలు
  • అమిత్ షాతోనూ రాష్ట్ర అంశాలపై చర్చ
AP CM Jagan met union home minister Amit Shah in Delhi

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించనున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అంతకుముందు సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదట కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లను కలిసి ఏపీ ప్రాజెక్టులు, ఇతర పథకాలపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు.

కాగా, సీఎం జగన్ తో భేటీపై కేంద్రమంత్రి షెకావత్ ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని వెల్లడించారు. జల్ శక్తి సంబంధింత ప్రాజెక్టులపై చర్చించామని తెలిపారు. ఏపీలో 100 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చే అంశం చర్చకు వచ్చిందని వివరించారు.

More Telugu News