'పుష్ప' సాంగులో మెగాస్టార్ మెరుస్తారంటూ రూమర్!

10-06-2021 Thu 18:38
  • సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ క్రేజీ కాంబినేషన్
  • స్పెషల్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్
  • 'పుష్ప' కోసం మాస్ మసాలా సాంగ్
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
Chiranjeevi in Pushpa special song

ఇప్పుడు టాలీవుడ్లో ఒక రూమర్ గుప్పుమంటోంది. 'పుష్ప'లోని ఒక పాటలో చిరంజీవి కనిపించనున్నారనేదే ఆ రూమర్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా అలరించనుండగా, ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఓ నెలరోజుల పాటు షూటింగు చేస్తే, ఫస్టు పార్టుకు సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. దేవిశ్రీ - సుకుమార్ కాంబినేషన్లో ఇంతవరకూ వచ్చిన స్పెషల్ సాంగ్స్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. అలాగే ఈ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఈ సాంగులో ఒక చోట చిరంజీవి ఇలా మెరిసి అలా మాయమవుతారట. ఆ బిట్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కు ఇస్తుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో సరదాగా ఇలా మెరవడానికి చిరంజీవి సరదాపడతారనేది నిజమే అయినా, ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.