తిరుమల కొండపై గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసిన టీటీడీ

10-06-2021 Thu 17:51
  • 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు
  • పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు సందేశం
  • ఎస్ఎంఎస్ వస్తే నగదు చెల్లించి రూం పొందేలా ఏర్పాట్లు
  • ఎల్లుండి రిజిస్ట్రేషన్ కేంద్రాల ప్రారంభం
TTD to setup registration centers for room booking

తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త ప్రణాళిక అమలు చేస్తోంది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పారు.

ఈ కేంద్రాల వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ద్వారా గదుల సమాచారం అందించనున్నారు. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈ నెల 12న ఉదయం 8 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించనుంది.