బసవతారకం ఆసుపత్రి సిబ్బందితో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

10-06-2021 Thu 16:44
  • నేడు బాలయ్య జన్మదినం
  • తల్లిదండ్రులకు నివాళులర్పించిన వైనం
  • బసవతారకం ఆసుపత్రిలో కేక్ కోసిన బాలయ్య
  • డాక్టర్లు, ఇతర సిబ్బంది, చిన్నారులతో వేడుకలు
Balakrishna celebrates his birthday in Basavatarakam cancer hospital

టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. స్వర్గస్తులైన తన తల్లిదండ్రులు బసవతారకం, నందమూరి తారక రామారావుల ఆశీస్సులతో ఇవాళ తన జన్మదిన వేడుకలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి నిర్వహించినట్టు బాలకృష్ణ వెల్లడించారు.

క్యాన్సర్ రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు తగిన శక్తిని పొందినట్టు భావిస్తున్నానని తెలిపారు. అంతకుముందు బాలయ్య ఆసుపత్రిలో తన తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఆసుపత్రిలో భారీ కేక్ కట్ చేసి వైద్యులు, ఇతర సిబ్బంది, క్యాన్సర్ బాధిత చిన్నారులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.