ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌ల్దేరిన‌ వైఎస్‌ జగన్

10-06-2021 Thu 12:29
  • జగన్  వెంట ప‌లువురు ఎంపీలు
  • మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ఢిల్లీ చేరుకోనున్న సీఎం 
  • ఈరోజు రాత్రి కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్‌షాతో భేటీ 
jagan to reach delhi

గన్నవరం విమానాశ్ర‌యం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఢిల్లీ బయల్దేరారు. ఆయ‌న వెంట వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ఆయ‌న ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు రాత్రి కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

అంత‌కుముందే జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసి చ‌ర్చించ‌నున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయ‌న‌ చర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సీఎం తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని త‌న అధికారిక నివాసానికి చేరుకుంటారు.