మ‌న పార్టీ సిద్ధాంతాలు, ఎజెండా ఎలా ఉండాలో ఈ నంబ‌రుకు సూచించండి: వైఎస్ ష‌ర్మిల‌

10-06-2021 Thu 12:15
  • జులై 8న ష‌ర్మిల కొత్త పార్టీ
  • ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ పూర్తి
  • ప్రజల ఆశయాలే పార్టీ సిద్ధాంతాలన్న ష‌ర్మిల‌
  • పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని పిలుపు
sharmila requests to people

తెలంగాణ‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు వైఎస్‌ షర్మిల ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆమె ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీగా దాదాపు ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని ఇప్ప‌టికే ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త వాడుక రాజగోపాల్ ప్ర‌క‌ట‌న కూడా చేశారు.

రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయనున్న నేప‌థ్యంలో పార్టీ సిద్ధాంతాలు, జెండా, ఎజెండా వంటి అంశాల‌పై తుది నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా ష‌ర్మిల త‌న మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ మేర‌కు ఆమె ఈ రోజు ట్విట్ట‌ర్‌లో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

'ప్రజల ఆశయాలే... పార్టీ సిద్ధాంతాలు.. పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలి ... ప్రతి బిడ్డ ఒప్పుకునేలా ఉండాలి.. సలహాలు, సూచనలు కొరకు వాట్స‌ప్ నంబ‌రు 8374167039కు పంపండి లేదా reach@realyssharmila.comకు ట్వీట్ చేయండి' అని ఆమె ప్ర‌జ‌ల‌ను కోరారు