Harish Shankar: ఈవీవీ కెరియర్లోనే అది గొప్ప సినిమా: హరీశ్ శంకర్

 Harish Shankar said Aame is good movie in EVV movies
  • ఈవీవీ గొప్ప దర్శకుడు
  • ఆత్మవిశ్వాసమే ఆయన ఆయుధం
  • 'ఆమె' ఆయన గర్వపడే సినిమా
  • ఆయనను ఎవరూ మరిచిపోలేరు
ఈ తరం దర్శకులలో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కి మంచి క్రేజ్ ఉంది. మెగా హీరోలతో ఆయన చేసిన సినిమాలు యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అలాంటి హరీశ్ శంకర్ తన తదుపరి సినిమాను పవన్ కల్యాణ్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రోజున దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ జయంతి కావడంతో, ట్విట్టర్ వేదికగా ఆయన తన మనసులోని భావాలను పంచుకున్నాడు. దర్శకుడిగా ఈవీవీ వైభవాన్ని గుర్తుచేశాడు.          

"ఈవీవీ సత్యనారాయణగారు దర్శకుడు కావడానికీ .. తనకి వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఎంతగానో కష్టపడ్డారు. తొలి సినిమా 'చెవిలో పువ్వు' పరాజయం పాలైనప్పటికీ ఆయన డీలాపడిపోలేదు. ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లారు. ఎప్పుడు చూసినా ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించేవారు. ఆయన సినిమాలు చాలా సరదా సరదాగా సాగిపోతూ ఉండేవి. అలాంటి ఆయన 'ఆమె' సినిమా తీయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజంగా అది ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా .. ఆయన గర్వపడేలా చేసిన సినిమా. అలాంటి దర్శకుడిని ఎవరు మాత్రం మరిచిపోగలరు?" అంటూ చెప్పుకొచ్చాడు.
Harish Shankar
EVV Sathyanarayana
Aame Movie

More Telugu News