Gantasala Ratnakumar: దిగ్గజ గాయకుడు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూత

  • చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న రత్నకుమార్
  • గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఘంటసాల కుమారుడు
Ghantasala Ratnakumar son of legendary singer passed away

డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దిగ్గజ గాయకుడు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలడం గమనార్హం. రత్నకుమార్‌కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు.

More Telugu News