సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

10-06-2021 Thu 07:26
  • సమంతకు భారీ పారితోషికం 
  • సంక్రాంతికి పవన్, రానాల సినిమా
  • 'మాస్టర్' రీమేక్ లో సల్మాన్ ఖాన్   
Samantha charges a bomb for Family Man series

*  కథానాయిక సమంత నటించిన 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సీరీస్ ప్రేక్షకుల ఆదరణతో పాటు తమిళుల ఆగ్రహాన్ని కూడా పొందుతోంది. ఇది తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందంటూ వివాదం చెలరేగుతోంది. ఇదిలావుంచితే, ఇందులో సమంత నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక పారితోషికం విషయానికి వస్తే, ఈ సీరీస్ కోసం ఈ ముద్దుగుమ్మ నాలుగు కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
*  మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' హిట్ చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్, రానా లతో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. వచ్చే నెల నుంచి ఈ చిత్రం తదుపరి షూటింగును కొనసాగిస్తారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
*  తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడుగా ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన 'మాస్టర్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ కి ఈ కథ బాగా నచ్చడంతో రీమేక్ చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది.