Solar Eclipse: రేపు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో ప్రభావం నిల్!

  • ఈ ఏడాది నాలుగు గ్రహణాల్లో చంద్రగ్రహణం పూర్తి
  •  సూర్యగ్రహణం సందర్భంగా ‘రింగ్ ఆఫ్ ఫైర్’
  • మిగతా రెండు గ్రహణాల ప్రభావం కూడా భారత్‌పై ఉండదంటున్న నిపుణులు
Solar Eclipse 2021 on June 10

ఈ ఏడాది ఏర్పడనున్న నాలుగు గ్రహణాల్లో మే 26న చంద్రగ్రహణం పూర్తికాగా, రేపు (గురువారం) సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే, గ్రహణ ప్రభావం భారత్‌పై ఉండే అవకాశం స్వల్పమే. నాసా ప్రకారం.. భారత్‌లో ఒక్క లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే ఇది కనిపించే అవకాశం ఉంది. రేపటి గ్రహణానికి ఓ విశేషం ఉంది. సూర్యుడికి చంద్రుడు పూర్తిగా అడ్డురావడం వల్ల ఓ రింగ్ ఏర్పడుతుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు.

రేపటి గ్రహణం గ్రీన్‌లాండ్, కెనడా, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్, అంటార్కిటికా, యూరప్, రష్యా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో కనబడుతుంది. ఆయా దేశాల్లో మధ్యాహ్నం 1.42 గంటలకు మొదలై సాయంత్రం 6.41 గంటలకు ముగియనుంది. ఇక, ఈ ఏడాది కనిపించనున్న మిగతా రెండు గ్రహణాల్లో ఒకటి నవంబరు 19న ఏర్పడుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. మరోటి డిసెంబరు 4న ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే, ఈ గ్రహణాలేవీ భారత్‌లో కనిపించవు.

More Telugu News