జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూలు ఖరారు

09-06-2021 Wed 21:35
  • రేపు ఉదయం పదిన్నర గంటలకు విజయవాడలో బయలుదేరనున్న సీఎం
  • మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి
  • రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ
AP CM Delhi tour confirmed

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అలాగే, పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, విభజన సమస్యలతోపాటు పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటారు.