600 మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ‘కళామతల్లి చేదోడు’

09-06-2021 Wed 21:20
  • నిర్మాతలు దిల్‌రాజు, చదలవాడ, రవిచంద్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
  • ‘కళామతల్లి చేదోడు’ పేరుతో కార్యక్రమం
  • ఒక్కొక్కరికి రూ. 2500 విలువైన సరుకుల పంపిణీ
kalamathalli chedodu distributed essential goods to cine workers

కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు కొందరు ముందుకొచ్చారు. నిర్మాతలు దిల్‌రాజు, చదలవాడ శ్రీనివాసరావు, యలమంచిలి రవిచంద్ కలిసి ‘కళామతల్లి చేదోడు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు 600 మంది సినీ కార్మికులకు రూ. 2500 విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దిల్‌రాజు, చదలవాడ శ్రీనివాసరావు, యలమంచిలి రవిచంద్‌లను పలువురు ప్రముఖులు అభినందించారు.