తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

09-06-2021 Wed 20:40
  • నేడు 1,813 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు  
  • ఇంకా క్రియాశీలంగా 24,301 కేసులు
  • కామారెడ్డిలో అత్యల్పంగా ఆరు కేసులు 
1813 corona cases came to light in Telangana today

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు దిగి వస్తున్నాయి. గత 24 గంటల్లో 1,813 కేసులు వెలుగు చూడగా, 17 మంది కరోనాతో కన్నుమూసినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,29,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,96,813కు పెరిగింది.

అలాగే, ఇప్పటి వరకు మొత్తం 3,426 మంది చనిపోయారు.1,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 24,301 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు వెలుగుచూశాయి. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి.


.