'ఖైదీ' డైరెక్టర్ ను లైన్లో పెట్టిన చరణ్?

09-06-2021 Wed 19:04
  • శంకర్ తో చరణ్ తాజా చిత్రం
  • త్వరలోనే సెట్స్ పైకి
  • లోకేశ్ కనగరాజ్ కి ముట్టిన అడ్వాన్స్
  • 'విక్రమ్' మూవీతో బిజీగా ఉన్న డైరెక్టర్  
Charan another movie with khaidi director

తమిళనాట మురుగదాస్ తరువాత ఆ రేంజ్ లో దూసుకుపోతున్న యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. మురుగదాస్ సినిమాకి టేకింగ్ ప్రధానమైన బలంగా నిలుస్తుంది. లోకేశ్ కనగరాజ్ సినిమాకి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా నిలుస్తుంది. అంతే కాకుండా చాలా తక్కువ బడ్జెట్ తో కూడిన కథలను ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. అందువల్లనే ఆయనతో సినిమాలు చేయడానికి విజయ్ .. కమల్ వంటి టాప్ స్టార్స్ ఆసక్తిని కనబరిచారు. ప్రస్తుతం ఆయన కమల్ సొంత బ్యానర్ పై 'విక్రమ్' సినిమా చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే చరణ్ దృష్టి కూడా లోకేశ్ కనగరాజ్ పై పడిందనే టాక్ వచ్చింది. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని అనుకున్నారు. కానీ నిజంగానే చరణ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు ఉంటుందనే వార్తలు బలపడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ ఆల్రెడీ లోకేశ్ కనగ రాజ్ కి ముట్టిందని చెప్పుకుంటున్నారు. చరణ్ తదుపరి సినిమా శంకర్ తో ఉండనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.