కొరటాలతో చిరూ ఆ మాట చెప్పారట!

09-06-2021 Wed 18:32
  • 'ఆచార్య'గా చిరంజీవి
  • కరోనా కారణంగా ఆగిన షూటింగ్
  • త్వరలో మొదలుపెట్టే ఛాన్స్
  • దసరాకి రిలీజ్  చేసే ఆలోచన    
Chiranjeevi said Acharya shooting should be completed as soon as possible

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ పది పదిహేను రోజుల పాటు చిత్రీకరణ చేస్తే షూటింగు పూర్తయ్యేది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే కరోనా తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. యూనిట్ సభ్యులు కూడా కరోనా బారిన పడుతూ ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగును ఆపేశారు. అప్పటి నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే కొన్ని రోజులుగా కరోనా ప్రభావం తగ్గుతూ వస్తోంది. దాంతో చాలా సినిమాలు తిరిగి తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే 'ఆచార్య' సినిమా షూటింగును గురించి కొరటాలతో చిరంజీవి మాట్లాడినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా 'ఆచార్య' బ్యాలెన్స్ ను షూట్ చేయమని చెప్పారట. లాక్ డౌన్ సడలింపులను దృష్టిలో పెట్టుకుని, చకచకా షూటింగును కానిచ్చేయమని అన్నారట. దాంతో కొరటాల ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడని చెప్పుకుంటున్నారు. చిరంజీవి స్పీడ్ చూస్తుంటే, ఈ సినిమాను దసరా బరిలోకి దింపేలానే కనిపిస్తున్నారు మరి.