తిరుమలలో కలకలం.. రాతి శంఖుచక్రాలు మాయం

09-06-2021 Wed 18:21
  • ఏడేళ్ల క్రితం శ్రీవారి మెట్టు వద్ద ఏర్పాటు చేసిన రాతి శంఖుచక్రాలు
  • మాయం కావడంతో భక్తుల ఆందోళన
  • రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్
Stone Sankhu Chakras in Srivari mettu went missing

తిరుమలలో ఇప్పుడు మరో కలకలం రేగింది. శ్రీవారి మెట్టు దగ్గర ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శ్రీవారి నామం, రాతి శంఖుచక్రాలు మాయమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయగా, మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు వాటిని పూజించి ముందుకు సాగడం సర్వసాధారణమైంది. అయితే,  ఇటీవల అవి మాయం కావడంతో విస్తుపోయిన భక్తులు విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వాటిని త్వరగా గుర్తించి తిరిగి మెట్టు వద్ద ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.