మురుగదాస్ దర్శకత్వంలో రామ్!

09-06-2021 Wed 17:59
  • యూత్ లో మంచి ఫాలోయింగ్
  • మాస్ ఆడియన్స్ లోను పెరిగిన క్రేజ్
  • లింగుస్వామితో పట్టాలపైకి
  • లైన్లో మురుగదాస్
Ram another movie is Muruga doss

రామ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది .. 'ఇస్మార్ట్ శంకర్' నుంచి మాస్ లోను ఆయన అభిమానుల సంఖ్య పెరిగింది. ఇటీవల రామ్ చేసిన 'రెడ్' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయినా రామ్ డీలాపడిపోకుండా లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.

మరోపక్క, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కి కూడా రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవలే రామ్ కి మురుగదాస్ ఒక డిఫరెంట్ లైన్ వినిపించాడట. తనకి చాలా నచ్చిందని రామ్ అనడంతో, పూర్తిస్థాయి కథను మురుగదాస్ సిద్ధం చేసి తీసుకుని వచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం ఆ కథపైనే చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు.

ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి రామ్ తన పారితోషికాన్ని భారీగా పెంచాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? ఇంకా ఈ ప్రాజెక్టులో ఎవరెవరు భాగం కానున్నారనేది త్వరలో తేలనుంది.