జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సమ్మె విరమించిన వైద్యులు

09-06-2021 Wed 17:51
  • పలు డిమాండ్లతో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు
  • చర్చలు జరిపిన మంత్రి ఆళ్ల నాని
  • ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమించిన జూడాలు
AP Junior doctors Called off strike

ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు కొవిడ్ ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా, స్టైఫండ్ ఇవ్వాలని, ఆసుపత్రులలో తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ముఖ్యకార్యదర్శి జూడాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.  ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, కాబట్టి సమ్మె విరమిస్తున్నామని వైద్యులు ప్రకటించారు.