తెలంగాణలో ఆర్టీసీ, మెట్రోరైల్ సర్వీసు వేళల పొడిగింపు

09-06-2021 Wed 17:48
  • తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సులను తిప్పనున్న ఆర్టీసీ
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో మెట్రో రైళ్లు
TSRTC and Metro timings extended

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో... ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

ప్రస్తుతం 3,600 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుగుతున్నాయని.. వాటినే సాయంత్రం 6 వరకు తిప్పబోతున్నట్టు తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదులోని సిటీ బస్సులన్నీ తిరుగుతాయని చెప్పింది.

హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైళ్లను తిప్పుతామని తెలిపింది. చివరి రైలు సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుందని పేర్కొంది.