బాల్క సుమన్‌ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఅర్

09-06-2021 Wed 17:35
  • ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాల్క సుమన్ తండ్రి సురేశ్
  • మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహించిన సురేశ్
  • హైదరాబాద్ నుంచి సుమన్ గ్రామానికి వెళ్లిన కేసీఆర్
KCR pays condolences to Balka Suresh

టీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మెట్  పల్లి మండలం రేగుంటలోని బాల్క సుమన్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేగుంట చేరుకున్నారు.

అనంతరం సురేశ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాల్క సురేశ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మెట్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహించారు. రైతులకు అండగా నిలిచి, అందరి అభిమానాలను చూరగొన్నారు.