బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 'అఖండ' నుండి కొత్త పోస్టర్ రిలీజ్

09-06-2021 Wed 17:23
  • రేపు బాలకృష్ణ పుట్టినరోజు
  • ముగింపు దశలో 'అఖండ'
  • దసరాకి విడుదల చేసే ఛాన్స్    
  • త్వరలో సెట్స్ పైకి కొత్త ప్రాజెక్టు
Akhanda movie new poster release

రేపు బాలకృష్ణ పుట్టిన రోజు  .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  'అఖండ' సినిమా నుంచి, స్పెషల్ పోస్టర్ గానీ .. ట్రైలర్ గాని .. సింగిల్ గాని రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విజయోత్సవంతో ప్రజలంతా సంబరాలు జరుపుతూ ఉంటే, కథానాయకుడిగా బాలకృష్ణ దర్జాగా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. 'సింహా' .. 'లెజెండ్' సినిమాల్లో మాదిరిగానే., ఈ సినిమాలోను బాలకృష్ణను బోయపాటి మరింత హ్యాండ్సమ్ గా చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తూ ఉండగా, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా చేస్తున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. విభిన్నమైన లుక్స్ తో బాలకృష్ణ కనిపించే ఈ సినిమాను, దసరా సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆ తరువాత సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే.