ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

09-06-2021 Wed 16:47
  • కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షల రద్దు
  • ఇంటర్ సెకండియర్ పరీక్షలను  రద్దు చేస్తారంటూ ప్రచారం
  • ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి సబిత
soon will announce about inter second year Exams says sabitha

కొవిడ్ కల్లోలం నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఫస్టియర్ పరీక్షలను ఇప్పటికే రద్దు చేసినప్పటికీ సెకండియర్ పరీక్షల నిర్వహణపై డోలాయమానంలో పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ ఈ విషయమై చర్చకు వచ్చినప్పటికీ పరీక్షల విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు.

 మరోవైపు, ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా స్పందించారు. పరీక్షల రద్దు విషయంలో ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. దీనిపై త్వరలోనే సమీక్ష నిర్వహించిన అనంతరం స్పష్టమైన ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు.