Nusrat Jahan: మేం విడిపోయాం.. మా పెళ్లి ఈ దేశంలో చెల్లదు: తృణమూల్ ఎంపీ నస్రత్ జహాన్ సంచలన వ్యాఖ్యలు

Nusrat Jahan says marriage with Nikhil Jain is invalid in India
  • భారత చట్టాలు మా పెళ్లిని గుర్తించవు
  • దానికి ప్రత్యేక చట్టాలేమీ లేవు
  • కాబట్టి మావి విడాకులన్న మాటే లేదు
  • ఏడు పాయింట్లుగా వెల్లడించిన నస్రత్ 
నిఖిల్ జైన్ తో టర్కీలో జరిగిన తమ వివాహం గురించి, ఆ వివాహ బంధాన్ని తెంచుకోవడంపైనా తృణమూల్ ఎంపీ, సినీ నటి నస్రత్ జహాన్ ఎట్టకేలకు నోరు విప్పారు. టర్కిష్ చట్టాల ప్రకారం జరిగిన తమ పెళ్లి భారత్ లో చెల్లుబాటు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిఖిల్ జైన్ తో వివాహ బంధం నుంచి బయటకు వచ్చేయడంపై ఆమె ఇవాళ ప్రకటన చేశారు. తన వారసత్వంగా వచ్చిన నగలు, ఆస్తులను అక్రమంగా లాగేసుకున్నారని, తన డబ్బులను అక్రమ మార్గాల్లో వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఏడు భాగాలుగా తన ప్రకటనను వివరించారు.

  • టర్కిష్ వివాహ చట్టాల ప్రకారం, విదేశాల్లో వుంటున్నప్పుడు ఆ వివాహానికి న్యాయ బద్ధత లేదు. అందునా మతాంతర వివాహం కావడం వల్ల.. భారత్ లో దానికి చట్టబద్ధతనిచ్చే ప్రత్యేక వివాహ చట్టాలంటూ ఏమీ లేవు. చట్టం ప్రకారం అది అసలు పెళ్లే కాదు. కానీ, సహజీవనంతో సమానం. కాబట్టి విడాకులు అనే మాటే లేదు. మేము ఎప్పుడో విడిపోయాం. తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దన్న ఉద్దేశంతోనే రహస్యంగా ఉంచాను.
  • పని కోసం లేదా ప్రశాంతత కోసం ఒక్కదానినే వెళ్లాను. నాతో నేను విడిపోయిన వ్యక్తి రాలేదు. వాటికి ఖర్చులూ నేనే భరించాను.
  • నా సోదరి విద్యకయ్యే వ్యయాన్ని నేనే భరిస్తున్నాను. నా కుటుంబ బాధ్యతనూ చూసుకుంటున్నాను. మొదట్నుంచీ వారి బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ప్రస్తుతం నాకు ఎలాంటి ‘సంబంధం’ లేని వ్యక్తి క్రెడిట్ కార్డులను నేను వాడవలసిన అవసరం నాకు లేదు.
  • ధనవంతుడిని అని చెప్పుకున్న వ్యక్తి, నేను అతనిని వాడుకున్నానని చెప్పిన ఆ వ్యక్తే.. నా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తీసుకున్నాడు. అర్ధరాత్రుళ్లు నా ఖాతాల నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నాడు. విడిపోయిన తర్వాత కూడా అది జరిగింది. దీనిపై బ్యాంకు అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాను. త్వరలోనే పోలీసు కేసు కూడా పెడతాను.
  • నా దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఇంకా వారి దగ్గర్నే ఉన్నాయి. నా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు పెట్టిన బంగారు ఆభరణాలను వారి దగ్గరే పెట్టుకున్నారు. నేను కష్టపడి సంపాదించుకున్నదీ వారి దగ్గరే ఉంచుకున్నారు.
  • డబ్బున్నంత మాత్రాన ప్రతి మగాడూ బాధితుడు కాలేడు. మహిళను ఒంటరిని చేయలేడు. నా కష్టంతో నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాను.
  • నాకు సంబంధం లేని వ్యక్తులతో నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇక ఏ మాత్రమూ లేదు. కాబట్టి నా జీవితంలో ఏ మాత్రం భాగం కాని తప్పుడు వ్యక్తిని మీడియా ప్రశ్నించకూడదని కోరుతున్నా.
Nusrat Jahan
Nikhil Jain
West Bengal
Trinamool
TMC

More Telugu News