విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ?

09-06-2021 Wed 10:46
  • షూటింగు దశలో 'పుష్ప'
  • బోయపాటితో కథా చర్చలు
  • గతంలో హిట్ కొట్టిన 'సరైనోడు'
  • కథపై విక్రమ్ కుమార్ కసరత్తు      
 Allu Arjun in Vikram Kumar direction

అల్లు అర్జున్ తన సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. సాధ్యమైనంత వరకూ స్టార్ డైరెక్టర్లతోనే ఆయన సినిమాలు చేస్తూ ఉంటాడు. కథల విషయంలో ఆయనను ఒప్పించడం చాలా కష్టమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. కథ పెర్ఫెక్ట్ గా వచ్చిన తరువాతనే ఆయన సెట్స్ వైపు అడుగు వేస్తాడు. అలాంటి అల్లు అర్జున్ తన  తదుపరి సినిమాను బోయపాటితో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'సరైనోడు' తరహాలో ఎమోషన్ తో కూడిన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ వీరి కాంబినేషన్లో రూపొందనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

అయితే విక్రమ్ కుమార్ ను కూడా ఒక మంచి కథను రెడీ చేయమని అల్లు అర్జున్ చెప్పాడట. అప్పటి నుంచి విక్రమ్ కుమార్ అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. మొదటి నుంచి కూడా విక్రమ్ కుమార్ వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆయనకి చెప్పుకోదగిన హిట్లు లేవు. ప్రస్తుతం ఆయన చైతూ హీరోగా 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమా బన్నీతోనే ఉండొచ్చని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.