మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

09-06-2021 Wed 10:12
  • షూటింగు దశలో 'గని'
  • సెట్స్ పైనే ఉన్న 'ఎఫ్ 3'
  • లైన్లో త్రినాథరావు నక్కిన  
Varun Tej another movie with Nakkina Trinatharao

వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 'గని' సినిమా చేస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. అలాగే 'ఎఫ్ 3' సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కూడా త్వరలో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మరో దర్శకుడికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడి పేరే నక్కిన త్రినాథరావు. తాజాగా ఆయన చెప్పిన కథ నచ్చడంతో, వెంటనే వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

అయితే కొంతకాలంగా త్రినాథరావు .. రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'ఖిలాడి' తరువాత ఈ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో రవితేజ .. శరత్ మండవ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఇప్పుడేమో వరుణ్ తేజ్ తో త్రినాథరావు సినిమా ఓకే అయిందని అంటున్నారు. రవితేజతో ఆయన సినిమా కేన్సిల్ అయిందా? రవితేజకి వినిపించిన కథనే ఆయన వరుణ్ తేజ్ తో చేయనున్నాడా? అన్న విషయాల్లో క్లారిటీ రావలసి ఉంది.