Punjabi singer: రైతు ఉద్యమానికి మద్దతుగా వరుస ట్వీట్లు.. నలుగురు ప్రముఖుల ఖాతాలను తొలగించిన ట్విట్టర్

Punjabi singer Jazzy Bs Twitter account blocked
  • పంజాబ్ ర్యాప్ సింగర్ జస్విందర్ సింగ్, హిప్‌హాప్ కళాకారుడు సుఖ్‌దీప్ సింగ్ భోగల్ ఖాతాల నిలిపివేత
  • రైతుల మరణాలపై ట్వీట్లతో పెద్ద ఎత్తున ప్రచారం
  • ప్రభుత్వ సూచనతో ఖాతాలను సస్పెండ్ చేసిన ట్విట్టర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేసిన నలుగురు ప్రముఖుల ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. రైతు ఉద్యమంపై ట్వీట్లు చేస్తూ అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రభుత్వ సూచనతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ నిలిపివేసిన ఖాతాల్లో పంజాబ్‌కు చెందిన ప్రముఖ ర్యాప్ సింగర్ జస్విందర్ సింగ్ బైన్స్ (కెనడా), హిప్ హాప్ కళాకారుడు సుఖ్‌దీప్ సింగ్ భోగల్ (ఆస్ట్రేలియా) సహా మరో ఇద్దరి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది.

పంజాబ్‌లో పుట్టి కెనడాలో పెరిగిన జస్విందర్‌సింగ్ ‘క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ భాంగ్రా’గా పేరుకెక్కారు. ‘ఘగియన్ దా జొర్రా’, ‘హుస్నా ది సర్కార్’ వంటి పాటలు ఆయనకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి. జస్విందర్‌, సుఖ్‌దీప్ సింగ్ ఇద్దరూ రైతు ఉద్యమానికి మద్దతుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఉద్యమం సందర్భంగా సంభవించిన మరణాలపై వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనతో వీరి ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది.
Punjabi singer
Jazzy B’s
Jaswinder Singh Bains

More Telugu News