44 కోట్ల కరోనా టీకా డోసులకు కేంద్రం ఆర్డర్లు!
- ఆగస్టు నుంచి అందుబాటులోకి
- 19 కోట్ల కొవాగ్జిన్ డోసులు
- 25 కోట్ల కొవిషీల్డ్ డోసులు
- ఇప్పటికే 30 కోట్ల బయోలాజికల్-ఇ టీకా డోసులకు ఆర్డర్
మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్-ఇ రూపొందిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ 30 కోట్ల డోసులను ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు కేంద్రం గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీకా వినియోగానికి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రమే అర్హులందరికీ ఉచితంగా టీకాలు అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ప్రకటన చేశారు. దీంతో వీలైనంత త్వరగా సార్వత్రిక వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో టీకా డోసుల కోసం ఆర్డర్ చేసింది.