అఫిడవిట్ లో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన వారికి శిక్షలు పెంచాలన్న సీఈసీ

08-06-2021 Tue 18:34
  • అఫిడవిట్ మోసాలపై సీఈసీ సీరియస్
  • కేంద్ర న్యాయశాఖకు లేఖ
  • శిక్ష పెంపు, పెండింగ్ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవాలని వినతి
  • ఆర్నెల్ల జైలు శిక్షను రెండేళ్లకు పెంచాలని సూచన
CEC wrote Union Law ministry on affidavit frauds

ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్లో కొందరు అభ్యర్థులు తప్పుడు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. అఫిడవిట్ లో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించే వారికి శిక్షలు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు శిక్ష పెంపు, ఇతర ప్రతిపాదనలపై కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది.

 అఫిడవిట్ మోసాలకు పాల్పడే అభ్యర్థులకు జైలు శిక్షను 6 నెలల నుంచి రెండేళ్లకు పెంచాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 నెలల జైలు శిక్ష సదరు అభ్యర్థులను ఎన్నికల్లో పోటీచేయకుండా ఆపలేకపోతోందని వివరించింది. పెండింగ్ ప్రతిపాదనలపై కేంద్రం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది.

తాజాగా, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ ఎన్నికల వేళ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని బాంబే హైకోర్టు నిర్ధారించిన సమయంలోనే ఎన్నికల సంఘం ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.