అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేతలు పాశవికంగా హత్య చేశారు: నారా లోకేశ్

08-06-2021 Tue 18:24
  • మలకాపురం గ్రామంలో హత్య
  • మీడియాలో కథనం.. స్పందించిన లోకేశ్
  • గోపాల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ
  • హంతకులని శిక్షించాలని డిమాండ్
Nara Lokesh responds to party worker murder

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాలపురం గ్రామంలో హత్య జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేతలు పాశవికంగా హత్య చేశారని ఆరోపించారు.

అధికారం అండతో వైసీపీ హత్యారాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త గోపాల్ ను హత్య చేసిన వారిని, హంతకులకు మద్దతుగా నిలిచినవారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. గోపాల్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

టీడీపీ హయాంలో రాష్ట్రమంతా అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తే... వైసీపీ రెండేళ్ల పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని లోకేశ్ పేర్కొన్నారు.