పవన్, అనిల్ రావిపూడి కాంబో.. నిర్మాతగా దిల్ రాజు!

08-06-2021 Tue 18:03
  • వరుస సినిమాలతో పవన్  
  • 'వకీల్ సాబ్' తో భారీ హిట్
  • దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా
Pavan kalyan movie in Anil Ravipudi and Dil Raaju combination

పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. దాంతో ఆయనతో ఓకే అనిపించుకోవడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ తో దిల్ రాజు నిర్మించిన 'వకీల్ సాబ్' భారీ విజయాన్ని సాధించింది. మరో సినిమా చేయడానికి దిల్ రాజు ఆయనను అప్పుడే ఒప్పించాడు. తదుపరి సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా పవన్ కి ముట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి దిల్ రాజు సరైన కథ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు.

తాజాగా ఆయన పవన్ కోసం ఒక మంచి కథను తయారు చేయమని అనిల్ రావిపూడికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి అటు పవన్ స్టైల్ .. ఇటు తన మార్కు కలిపి ఒక కథను తయారు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  'ఎఫ్ 3' తరువాత బాలకృష్ణతోగానీ .. శర్వానంద్ తో గాని అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత దిల్ రాజు - అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. గతంలో దిల్ రాజు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' .. 'ఎఫ్ 2' ఘన విజయాలను అందుకున్నాయి. హరీశ్ శంకర్ సినిమాను కూడా పూర్తిచేసిన తరువాత పవన్ వీరి ప్రాజక్టుపైకి వస్తాడన్న మాట.